పక్కా స్క్రీన్‌ప్లే! టక్కరి సినిమా! యాంటీ క్లైమాక్స్‌!!

12-1439367259-cbn-sujana-modi-678

ప్రత్యేక హౌదాకు మంగళం అనే ప్లాప్‌ సినిమాకు పక్కా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటివి చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. ఈ విషయమై నా విమర్శలు నిరంతరం చేస్తూనే వున్నాను. హౌదాకు కృష్ఫార్పణం, ప్యాకేజీకి పిండ ప్రదానం జరిగిపోయిందని గతంలోనే రాశాను. కాకుంటే ఆ యాంటీక్లైమాక్స్‌కు ఈ రోజు రంగం సిద్ధం చేశారు. బలిపీఠం ఎక్కించే ప్రాణికి అలంకారం చేసినట్టు అనుకూల మీడియాలో అలరించే కథనాలు, వ్యాఖ్యానాలు స్క్రోలింగులతో హౌరెత్తిస్తున్నారు. దీన్నే తెలుగులో చావుకబురు చల్లగా చెప్పడానికి ఇంత సన్నాహం నా నలభై ఏళ్ల రాజకీయ పాత్రికేయ జీవితంలో చూసి వుండను. దీనిపై మొన్న ఎన్‌టివి చర్చలో నేను చేసిన వ్యాఖ్యలపై చాలానే దుమారం రేగింది. హౌదా అనేది సెంటిమెంటు కాదు, అయింట్‌ మెంట్‌ కాదు కమిfm-arun-jaitley-with-venkaiah-naiduట్‌మెంట్‌ అన్నాను. హౌదాపై రాజీ లేదంటూనే ఎందుకు తెలుగుదేశం సన్నాయినొక్కులు నొక్కింది? రక్తం మరిగిందన్నవారు ఎందుకు కరిగిపోయారు అని ప్రశ్నించాను.సీనియర్‌ నాయకులు వెంకయ్య నాయుడు బొంకయ్య అనిపించుకోరాదని ఆకాంక్షించాను. దీనిపై బిజెపి టిడిపి నాయకులు విపరీతంగా రభస చేశారు గాని అక్కడ శ్రోతల నుంచి రాష్ట్రంలో ప్రేక్షకుల నుంచి కూడా నాకు చాలా అభినందనలు వచ్చాయి. నా మాటల్లో సత్యమేమిటో, ఇతరుల వాగ్దానాలు ఎలా బొంకుగా మారిపోయాయో ఈ రోజే రుజువవవున్నది.
ప్రత్యేక హౌదాకు స్వస్తి చెప్పామనే చేదునిజం ప్రకటించేబదులు దానికి ప్యాకేజీ పంచదార పూత పూస్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ విభజన చట్టంలోనూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటనలోనూ వున్నవే. ఆయన అందులో ప్రత్యేక హౌదా ప్రతిపత్తితో పాటు మరో అయిదు అంశాలు కూడా లిఖిలపూర్వకంగా అందజేశారు. అవే పన్ను రాయితీలు, కోరాపుట్‌ బోలాంగిర్‌ కల్హండి(కెబికె) ప్యాకేజీ,పోలవరం, సిబ్బంది పంపిణీ, వెనకబడిన జిల్లాలకు సహాయం. ఇవన్నీ ఆనాడే ప్రకటించినా అమలు చేయని దోషం బిజెపి కేంద్ర ప్రభుత్వానిది కాగా భాగంపంచుకున్న దోషం టిడిపిది ప్రభుత్వానిది. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ తతంగాన్ని ప్రజలతో మింగించే ప్రహసనం మాత్రమే.

ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటినుంచి పరిశీలిస్తున్న వ్యక్తిగా కింది విషయాలు ముందే చెప్పగలుగుతున్నాను

. ప్రత్యేకహౌదా తిరస్కరించబడింది.దీనికి రాజ్యాంగ కారణాలు లేవు. రాజ్యాంగంతో సంబంధమే లేదు. 14వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్‌లు కూడా కారణం కాదు. కేవలం బిజెపి ఏకపక్ష తిరస్కరణ ఇది
.ప్యాకేజీలో కొత్తగా ఇచ్చేవి ఏవీ లేవు. గతంలో సగం సగం ఇచ్చినవాటికి మరింత జోడింపు. మిగిలిన వాటిపై హామీలు,అప్పులకు ఏర్పాటు మాత్రమే
. వ్యావసాయిక రాష్ట్రంగా వున్న ఎపిని పారిశ్రామికీకరణ చేయాలంటే ప్రోత్సహకాలు కావాలి. . ప్రత్యేక హౌదా ప్రకారమైతే 100 శాతం ఎక్సయిజ్‌ రాయితీ, 100 శాతం ఐటి రాయితీ,30 శాతం క్యాపిటల్‌ సబ్సిడీ, 3 శాతం పెట్టుబడి రుణంపై సబ్సిడీ ఇవ్వాల్సి వుంటుంది. కాని కేంద్రం ఆవిధానం ఎత్తివేసిందని చెబుతూ కొంత విదిలించబోతున్నారు. నిజానికి ఈ ప్రోత్సహకాలను ముందుగా లెక్కకట్టడం సాధ్యం కాని పని. 500 కోట్లు లేదా మరేదో మొత్తం ఇచ్చినంత మాత్రాన ఔల్సాహిక పారిశ్రామిక వేత్తలు లేదా స్థానికులు ముందుకు వచ్చే వీలుండదు. బడా బాబులే మళ్లీ రంగాన్ని ఆక్రమిస్తారు. అసలు పారిశ్రామికీకరణ లక్ష్యమే దెబ్బతినిపోతుంది.
రాజధానికి డిపిఆర్‌లు తయారు కాలేదనే పేరిట నిధులు ఇవ్వడం లేదు
విదేశీ రుణాలతో చేపట్టే వాటికి సహాయం అంటే పరోక్షంగా విదేశాలకు ప్రభుత్వ కార్పొరేట్‌ పథకాలకు లాభం తప్ప ప్రజలకు రాష్ట్రానికి మేలు జరగదు
అప్పులు చేయించి తర్వాత వాటిని తనే భరిస్తామని చెబుతున్నా ఇది హామీ తప్ప చట్టబద్దత వుండదు.గతంలో మన్మోహన్‌ చేసినవి చట్టంలో చేర్చలేదంటున్న ఈ ప్రభుత్వం తను అదే పని మరింత పెద్ద ఎత్తున చేయబోతుంది.
ఇప్పటికి సగం పాలనా కాలం మాత్రమే మిగిలివుండగా లెక్కల్లో ఇవన్నీచూపించడం దండగమారి పని. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా ప్రజలు ఆమోదించరు.

ఇది రాసే సమయానికి సుజనా చౌదరి కొత్త పల్లవి వినిపిస్తూ మధ్యాహ్నం నుంచి సాయింత్రానికి వాయిదా వేస్తున్నారు. పురందేశ్వరి రేపు తెలుస్తుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు విజయవాడలో సంప్రదింపుల తతంగం నడిపిస్తున్నారు.
ఈ రాజకీయ రాజ్యాంగ నాటకం ఎలా పరిణమిస్తుందో చూద్దాం.. వెయిట్‌ సమ్‌ మోర్‌ టైమ్‌…

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *