అమెరికా వాదమే కావాలి: ట్రంప్‌

trump111
మనకు కావలసింది ప్రపంచవాదం కాదు. అమెరికన్‌ వాదమే. అమెరికన్లే ప్రథమ స్తానంలో వుండాలి అని ప్రకటించారు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌. జుగుప్సాకరం ఆందోళనకరమైన జాతి విద్వేష ప్రసంగాలతో ప్రపంచానికి రోత పుట్టించిన ఆ మహానుభావుడే ఈనాటి పరిస్థితులకు తగిన అభ్యర్థి అని గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీగా పిలవబడే రిపబ్లికన్లు నిర్ణయించారు. అమెరికా పరిస్తిఇ అత్యంత అధ్వాన్నంగా వుందని ఆయనే సూత్రీకరించారు. వలస వచ్చిన వారు మన ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. ఐఎస్‌ ఉగ్రవాదులు భద్రతను సవాలు చేస్తున్నారు.ఇన్‌ఫ్రా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అసమాన వాణిజ్య ఒప్పందాలను మనను కుంగదీస్తున్నాయి అని ఆయన విశ్లేషించారు. ఇందుకు విరుగుడు ఏమిటో కూడా ప్రకటించారు. వలసలను ఆపడం, ఇందుకోసం మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడం.టెర్రరిజాన్ని ప్రోత్సహించేవి అమెరికాకు వ్యతిరేకమైనవి అయిన దేశాల నుంచి రాకపోకలు నిషేదం, అమెరికా ఆధిపత్యానికి వాణిజ్య విస్తరణకు ప్రధాన పోటీదారుగా వున్న చైనాతో ప్రస్తుత షరతులను మార్చి మనకు అనుకూలమైనవి కుదర్చుకోవడం. ఐఎస్‌ ఉగ్రవాదులను తుడిచిపెట్టడం. ఇవన్నీ వినడానికి బాగున్నా వీటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా వుంటాయో వూహించవచ్చు. పైగా ఈపేరిట తీసుకునే చర్యలు ప్రపంచ దేశాలను ఎంతటి గందరగోళానికి గురిచేస్తాయో ట్రంప్‌రాజ్యం మొదలైనాక తెలుస్తుంది. ఇంతకూ ఐఎస్‌ పెరుగుదలకు విదేశాంగమంత్రిగా తన డెమోక్రటిక్‌ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ అనుసరించిన విధానాలే కారణమని ట్రంప్‌ తేల్చిచెప్పారు. అంటే ఒక విధంగా ఇది అమెరికా సృస్టి అని అంగీకరించారన్నమాట. ఇకపోతే ట్రంప్‌ పట్ల అనేక తరగతుల ప్రజానీకంలో అrepublican-national-convention-day-four_6286273e-4fbb-11e6-a5f1-138dd21979a8యిష్టం అసహనం వున్నా ఆయన తప్ప మరో గత్యంతరం లేదని రిపబ్లికన్‌ పార్టీ వ్యూహకర్తలు మహారాజ పోషకులు భావించడం యాదృచ్చికం కాదఱ. ఆర్థిక రాజకీయ సామాజిక సంక్షోభం నుంచి బయిటపడలేక పాశ్చాత్య దేశాలు జాతీయ వాదాన్ని విదేశాల పట్ల వలసల పట్ట వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాయి. తామే ప్రారంభించిన ప్రపంచీకరణ మంత్రాన్ని తిరస్కరిస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంలో ఈ అక్షణాలున్నాయి. ఇప్పుడు అమెరికా అద్యక్షుడు కాగల అవకాశమున్న వ్యక్తి ఆ మాట అంటున్నారంటే మన దేశంలోని ప్రపంచీకరణ ప్రవక్తలు నోరు వెళ్లబెట్టవలసిందే! అయితే ఆర్థిక వనరుల విషయంలో హిల్లరీ క్లింటన్‌ ముందున్నారట. ట్రంప్‌ దగ్గర 41 కోట్ల డాలర్లు వుంటే ఆమె దగ్గర 52 కోట్టడాలర్లు వున్నాయట. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. రాష్ట్రాల ప్రతినిధుల ఎంపిక ద్వారా చాలా తిరుగుడుగా జరిగే అమెరికా ఎన్నికల్లో ఆ స్థాయిలో చేసే ఖర్చులు ఇందులోకి రావు. అభ్యర్తుల తరపున కంపెనీలు చేసే ఖర్చులు కూడా లెక్కవేయరు. అసలు ఎవరు ఎక్కువ నిధులు సేకరిస్తారనేది కూడా ఒక కొలబద్దగా వుంటుంది.ఏమైతేనేం ఉద్రిక్త ప్రపంచంలో మరో ఉన్మాద సంభాషకుడు అమెరికా అత్యున్నత పీఠంవైపు నడుస్తున్నారు. పారా హుషార్‌!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *