బిజెపికి దెబ్బమీద దెబ్బ మీద దెబ్బ!

_80910429_modiworry
ఈసారి పార్లమెంటు సమావేశాలకు ప్రధాని మోడీ బృందం గొప్ప కసరత్తు చేసిందని వార్తాకథనాలు మార్మోగాయి. బిల్లుల ఆమోదం నల్లేరు మీద నడక అని వూహలు నడిచాయి. కాని పార్లమెంటు బయిటాలోపలా కూడా ఈ తరుణంలో బిజెపి పరిస్థితి చూస్తుంటే దెబ్బలతో ఉక్కిరి బిక్కిరవుతున్నట్టే వుంది.
చిన్న ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ దుస్సాహసం రాజ్యాంగ దుర్వినియోగం బిజెపికి మర్చిపోలేని పాఠం నేర్పింది. ి. గా అరుణాచల్‌ కేసులో సుప్రీం కోర్టు స్పీకర్‌ హక్కులు బాధ్యతలు గవర్నర్‌ పరిమితులు సుస్పష్టంగా నిర్వచించడం మరో మైలురాయి. నబాంతుకిని పునరుద్ధరించామంటూనే ఈ తీర్పు విచిత్రమైందని బిజెపి వ్యాఖ్యానించడం వారి సంకుచితత్వాన్ని బయిటపెట్టింది. రాజ్‌ఖోవా అస్వస్తత కారణంగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న గవర్నర్‌ తథాగదరారు కేవలం 48 గంటల వ్యవధిలోనే సభలో బలపరీక్ష ఎదుర్కోవాలని మెడమీద కత్తిపెట్టారు. ఈ వ్యవధిలో నబాం తుకి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పెమా కండూను ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేయడం వెళ్లిన వారంతా తిరిగి రావడం బిజెపి అవకాశవాదానికి సమ్మెటపోట్టయితే కాంగ్రెస్‌కు చాలా కాలం తర్వాత ఒకింత వూరటనిచ్చాయి. ఇప్పుడు పెమాకండూ సభలో 46 మంది ఎంఎల్‌ఎల మద్దతుతో ఘనంగా మెజార్టి నిరూపించుకోవడంతో కథ ముగిసింది. కాని పార్లమెంటులో కాశ్మీర్‌ అరుణాచల్‌, ఉత్తరాఖండ్‌ పరిణామాలపై తీవ్ర దూమారం తప్పలేదు.
కాని సామాజికంగా ్త మైనార్టీలు దళితుల పట్ల సంఫ్‌ు స్వాభావిక వివక్షా దృష్టి ్ష విషమ ఫలితాలకు దారితీసింది. ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రి సమీపంలోని గ్రామంలో గోమాంసం కలిగివున్నాడనే నెపంతో అఖ్లక్‌ ఖాన్‌ ప్రాణాలు తీసిన ఉదంతం దేశాన్ని కదిలించింది. కాని బిజెపి నేతలు పోలీసులపై ఒత్తిడి చేసి మరీ ఇప్పుడు ఆ కుటుంబంపై గోవధ కేసు పెట్టించారు(సమాజ్‌వాది ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎత్తివేయించవలసివుంది) ఇక వారు బిఎస్‌పి అధినేత మాయావతిపై చేసిన కువ్యాఖ్యలను రాజ్యసభ ఉపాద్యక్షుడే ఖండించవలసి వచ్చింది. రాష్ట్ర బిజెపి ఉపాద్యక్షుడిని తొలగించక తప్పలేదు.
ప్రధాని స్వంత సీమగుజరాత్‌లోని సౌరాష్ట్రలో దళితులపై అమానుష హింసాఘటన వీటన్నిటికి పరాకాష్ట. తరతరాల నుంచి అగ్రవర్ణాల ఆదేశాలతో మృతపశువుల కళేబరాలు వలిచి సేవలందిస్తున్న దళితులను గోవధ ఆరోపణతో బట్టలూడదీయించి కొట్టడం కోపాగ్ని రగిల్చింది. గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో ఉన్‌తాలూకా మోటా సోమాదిపూరలో నలుగురు దళితులను అర్థనగంగా కట్టేసి హింసించిన ఉదంతం సోషల్‌మీడియాలో ప్రసారమై దేశాన్ని ఉడికించింది. ఇది భరించలేక పదిహేనుమంది దళిత యువత ఆత్మహత్యకు ప్రయత్నించగా ఒకరు చనిపోయారు. ఉద్రిక్త పరిస్థితులలో జరిగిన దాడిలో ఒక పోలీసు మరణించారు. మరెందరో గాయపడ్డారు. వారే పాలించే మరో మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో అంబేద్కర్‌ కార్యక్షేత్రంగా నిలిచినచారిత్రిక భవనాన్ని కూలగొట్టడం కూడా ఇలాటి విమర్శలకే దారితీసింది. అంబేద్కర్‌ 125వ జయంతి అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఈ విద్వంసంతో నిజస్వరూపం బయిటపెట్టుకుంది.
గాంధీజీ హత్యలో ఆరెస్సెస్‌ హస్తం వుందంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యపై 499 కింద పరువు నష్టం దావా వేసినా పాక్షికంగానే పరువు దక్కింది. ఆరెస్సెస్‌ మనుషులు హత్య చేశారంటే చెల్లుతుంది గాని సంస్థ మొత్తాన్ని అనరాదని మాత్రమే సుప్రీం కోర్టు మధ్యంతర వ్యాఖ్య చేసింది. అదే గొప్ప కితాబుగా ఆనందించే సంఘీయులు తుదితీర్పు వరకూ వేచివుండటం మంచిది. గాడ్సేను దేశభక్తుడని కీర్తిస్తూ ఆయన జయంతి సభలు జరిపిన వైనం దేశం మోడీ గద్దెక్కాకే చూసింది. కనుక ఈ కేసు సాగితే బిజెపికి రాజకీయ లాభం కన్నా ఇరకాటమే పెరుగుతుంది. అంతెందుకు? హెచ్‌సియు జెఎన్‌యు వివాదాల్లో రెచ్చిపోయి మాట్లాడితే వీరనారిగా చిత్రించిన సృతి ఇరానీని శాఖ వారే మార్చేశారు. ఇప్పుడామె క్యాబినెట్‌ కమిటీలలో కూడా లేకుండా పోయారు.మరో వంక మరణించానని ప్రకటించిన తమిళ రచయిత పెరుమాల్‌ వరదన్‌ పునరుజ్జీవం కూడా గొప్ప ఉత్తేజం. .
కోరి తెచ్చుకున్న సుబ్రహ్మణ్యస్వామి కొరివితో తలగోక్కున్నట్టు రోజుకో రచ్చ తెస్తున్నా ప్రధాని ప్రత్యక్ష ఆశీస్సులున్నాయి గనకే కొనసాగుతున్నారు. అరదులోనూ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ రాజన్‌పై స్వామి కుళ్లుమోతు వ్యాఖ్యలు ప్రభుత్వమే సహించలేకపోయింది. రాజన్‌ పదవీ కాలం పొడగింపు వివాదం చేయగా ఆయనకు ఆయనే ఐచ్చికంగా కొనసాగబోనని ప్రకటించడం కూడా ఒక రాజకీయ పాఠమే. ఆ తర్వాత కాలంలో ఆయన విధాన నిర్ణయాలపై విమర్శలు పెంచారు. అయితే దేశంలో ధరలపెరుగుదల ద్రవ్యోల్బణం లేవనే వారిని రాజన్‌ నేరుగానే సవాలు చేయడం మున్నెన్నడూ ఎరుగని విషయం. భారత దేశంలో అభివృద్ది వున్నా ఉపాధి పెరగడం లేదని జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ నిర్ధారిస్తున్నాయి. పైగా మోడీ కుడి భుజం గౌతం అదానీ వంటివారి బాకీలతోనే బ్యాంకులు మునిగిపోతున్నాయని కూడా సోదాహరణంగా రుజువైంది. ప్రచారాలు ఎంత చేసుకున్నా ఈ వాస్తవాలు వెక్కిరిస్తూనే వున్నాయి. కార్పొరేట్లకు అయిదు లక్షల కోట్ల రాయితీలిచ్చిన మోడీ గ్యాస్‌ సబ్సిడీ వదులుకోవలసిందిగా చేసిన విజ్ఞప్తి వల్ల 22 వేల కోట్లు ఆదాఅయిందని పెద్ద ప్రచారం చేశారు. నిజంగా అది ప్రభుత్వ ఘనతా అనే విషయంఅలా వుంచితే- ఈ మిగులులో 90 శాతం పెట్రో ధరల తగ్గుదల పలితం మాత్రమేనని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌(సిఎజి) చెప్పడం కూడా ఒక చెంపదెబ్బే.

ఆఖరుగా చెప్పుకోవలసిన ఎదురుదెబ్బ నిజంగానే బ్యాట్స్‌మన్‌ అయిన నవజ్యోతిసింగ్‌ సిద్దు కొట్టిందే! నవజ్యోతిసింగ్‌ సిద్దులో రోసిపోయిన అకాలీ బిజెపి పాలననూ మైత్రిని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి నిష్క్రమించారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఓట్టు సాధించిన ఆప్‌లో చేరతారంటున్నారు. అది ఎలా వున్నా పంజాబ్‌లో అకాలీ బిజెపి కూటమి ఖాయమని మాత్రం తేలిపోయింది. ఈ విధంగా అనేక రూపాల్లో అన్ని కోణాల్లో అభిశంసనలకూ అపహాస్యానికి గురవుతున్నా మోడీ అమిత్‌ షా ల విధానాలు మార్చుకోకపోతే మరిన్ని దెబ్బలుతినడం అనివార్యమవుతుంది.
.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *