అమెరికాపై భ్రమలు -చైనాపై నిందలు

ind,ch,us
న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం దాదాపు ఖాయమైపోయినట్టు కొద్ది రోజుల కిందట మోడీ సర్కారు ప్రచారం హౌరెత్తించింది. ఇందుకు సహకరిస్తున్నందుకు గాను అమెరికాపై పొగడ్తల వాన కురిపించింది. ్ట అమెరికా పార్లమెంటులో మోడీ ప్రసంగానికి ప్రతిస్పందనపై పరవశంతో వర్ణించింది బడా మీడియా. ఇప్పుడు 48 దేశాలు గల ఎన్‌ఎస్‌జి సమావేశం ముగిసిపోయింది. ్తఅమెరికా హామీలు గాలికి ఎగిరిపోగా భారత్‌కు భంగపాటే మిగిలింది. మళ్లీ ఇదే మీడియా. ఇలా జరిగినందుకు అమెరికాను గాని, అతిగా ఆశలు కల్పించిన మోడీ ప్రభుత్వాన్ని గాని ఏమనకుండా చైనా అడ్డుపడిందని దానిచుట్టూ చర్చ తిప్పుతున్నది .ఎన్‌పిటి(అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం- న్యూక్లియర్‌నాన్‌ ప్రొలిఫరేషన్‌ ట్రీటీ) పై సంతకం చేసిన దేశాలకు మాత్రమే ఈ గ్రూపులో సభ్యత్వం వుండాలన్నది ఒక ముఖ్యమైన షరతు. అప్పటికే అణ్వస్త్ర హౌదా కలిగిన అయిదు దేశాలకు అనుకూలంగా వుంది గనక అది వివక్షా యుతమైందంటూ భారత్‌ చాలా ఏళ్లుగా దీనిపై సంతకం చేయలేదు. ఆ కారణంగా నే సియోల్‌లో జరిగిన ఎన్‌ఎస్‌జి సమావేశంలో నాలుగో వంతు అంటే పది దేశాలు భారత్‌ ప్రవేశానికి అభ్యంతరం చెప్పాయి. ఆస్ట్రేలియా మెక్సికో వంటి దేశాలు ఇండియా ఎన్‌ఎస్‌జి దరఖాస్తును తిరస్కరించాలని కోరాయి. బ్రెజిల్‌ దక్షిణాఫ్రికా, ఆస్ట్రియా, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. . ఒకవేళ ఇండియాకు మినహాయింపునిస్తే అప్పుడు పాకిస్తాన్‌ విషయం కూడా పరిశీలించాలని చైనా చెప్పింది. ఇది ఎన్‌పిటి నిబందనల సమస్య తప్ప భారత్‌ వ్యతిరేకత కాదని చైనా మీడియా చాలాసార్లు రాసింది. ి అక్కడ చేరుస్తామన్నట్టు మాట్లాడిన అమెరికా మొక్కుబడిగా సిఫార్సు చేయడం తప్ప శక్తివంతంగా లాబీయింగ్‌ జరిపిందేమీ లేదు.మన ప్రభుత్వం అక్కడకు వెళ్లడానికి ముందే అంటే నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్బంలోనే అన్నివిధాల దానికి జూనియర్‌ భాగస్వామిగా ప్రకటించుకుంది. రక్షణ రంగంలో భారత్‌ను మాతో చేర్చుకుంటున్నామని అమెరికా ప్రకటిస్తే ప్రధాని వంగివంగి కృతజ్ఞతలు చెప్పారు.గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా మాట్లాడిన దాన్ని మించి విధేయత ప్రకటించడమే గాక చైనాకు వ్యతిరేకంగానూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి భౌగోళికంగా ఏ సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలోనూ చైనాకు వ్యతిరేకంగా అమెరికా జపాన్‌ కూటమికి మద్దతునిస్తున్నట్టు మాట్లాడారు.
చైనా చెప్పిందేమిటి?
ఇరుదేశాల మధ్య చారిత్రిక వైరుధ్యాల రీత్యా చైనాపై ఆరోపణ చేయడం సులభంగా వుంటుంది గాని వాస్తవం అదేనా? పాకిస్తాన్‌ కోసం చైనా మనను అడ్డుకున్నట్టు పెద్ద ప్రచారం నడుస్తున్నది. అదే నిజమైతే పాక్‌కు భారీ ఆర్థిక సైనిక సహాయం కొనసాగిస్తూ దానికి ఫ్రధాన దన్నుగా వున్న అమెరికాకు ఆ విమర్శ అధికంగా వర్తిస్తుంది కదా!కాని ఇదే ఒక ఉదాహరణగా మారితే ముందు ముందు అమెరికా ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదం వుంటుంది.వారికి నచ్చి సిఫార్సు చేసినంత మాత్రాన చేర్చుకుంటూ పోతే బాధ్యతా రహితమైన దేశాలను కూడా సూచించవచ్చు. అందుకే మేము ఎన్‌పిటి కొలబద్ద గురించి చెబెతున్నాము తప్ప భారత్‌ ఇందులో చేరితే మాకు వచ్చే నష్టం లేదు అన్నది చైనా వివరణ. భారత దేశంలో పౌర అణుసహకారానికి కూడా తాము సిద్ధంగా వున్నామని చైనా చెబుతున్నది. మనం అమెరికాకు జూనియర్లుగా చేరి చైనా వ్యతిరేక వ్యూహాలలో భాగం పంచుకున్నప్పుడే ఇవన్నీ ఆలోచించవలసింది. ి అణు ఒప్పందంపై సంతకాలు చేయడంవల్ల కాలం చెల్లిన అపాయకరమైన అమెరికా అణు విద్యుత్‌ పరికరాల అమ్మకానికి మార్గమేర్పడుతుంది. వెస్టింగ్‌హౌస్‌ దగ్గర 2.8లక్షల కోట్ల ఖరీదైన ఆరు రియాక్టర్లు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదిరాయి. అందులోనూ ఈ ఆరు రియాక్టర్లు ఉత్తరాంధ్ర గుండెలపై కుంపటిలా కొవ్వాడలోనే అమర్చబోతున్నారు. ఆక్కడ ప్రజల్లో తీవ్రమైన నిరసన వస్తున్నా ఆరింటిని ఒకేచోట స్థాపించడం సరికాదని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మహౌత్సాహంగా వీటిని ఆహ్వానిస్తున్నది. అంటే వాణిజ్యం వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాతో చేస్తూ దాని ప్రయోజనాల మేరకు చైనా గాని మరే దేశం గాని మద్దతు ఇవ్వనందుకు తప్పుపట్టడం ఎలాటి విదేశాంగ నీతి?బ్రిక్స్‌లో మనతో పాటు సభ్యులుగా వున్న బ్రెజిల్‌ దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా వ్యతిరేకించడం నిజం . మోడీ పనికట్టుకుని స్విడ్జర్లాండ్‌, మెక్సికో వెళ్లి వచ్చినా అవి కూడా అభ్యంతరం తెలపడానికి, నార్వే న్యూజిలాండ్‌ వంటి దేశాలు గట్టిగా వ్యతిరేకించడానికి కారణమేమిటి. దీన్నే బహుదేశ దౌత్యం నెరపడంలో భారత్‌ లేదా మోడీ ప్రభుత్వ వైపల్యం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా పాకిస్తాన్‌ మైత్రి
చైనా పాకిస్తాన్‌కు మద్దతునిస్తుందని అంటుంటారు గాని ఆ విమర్శ అమెరికాకు ఇంకా ఎక్కువ వర్తించాల్సి వుంటుంది. ఎందుకంటే ఎఫ్‌16 విమానాలు వగైరాలన్నీ సరఫరా చేసేది సంక్షోభాల్లో పాక్‌ను ఆదుకునేది అమెరికానే.చైనాకు ఇండియాకు వున్న చారిత్రిక వైరుధ్యాల రీత్యానే పాక్‌కూ దానికి సాన్నిహిత్యం ఏర్పడిందన్నది వాస్తవం. అలాగే అంతర్జాతీయంగా చైనా వ్యతిరేక శిబిరానికి ఒక మూలపీఠంగా వున్న దలైలామా, తర్వాత కర్మపలామా వంటి వారికి మనం ఆశ్రయమిచ్చాం. ఇవన్నీ వాస్తవాలైనా పరస్పర చర్చల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు దీర్ఘకాలంగా కృషి చేస్తున్నాయి. మా సరిహద్దుల్లో ఒక బుల్లెట్‌ కూడా పేలలేదు అని చైనాతో సంబంధాలకూ పాక్‌ పరిస్థితికి మధ్య తేడాను మోడీయే వివరించారు. చైనా ఎన్‌పిటి గురించి మాట్లాడుతున్నదే గాని మనకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ముందస్తుగా ప్రకటించారు. అయినా సరే కొందరు మీడియా వ్కాఖ్యాతలు మాత్రం పనిగట్టుకుని చైనా అడ్డుకున్నదని చెబుతుంటారు. ఎన్‌ఎస్‌జి సమావేశాలకు ముందు మోడీ చైనా అద్యక్షడు సీ లింగ్‌పింగ్‌తోనూ చర్చలు జరిపి సహాయం కోరారని మర్చిపోరాదు. భారత ప్రభుత్వం అమెరికా భాగస్వామిగా ఈ ప్రయత్నం చేసేబదులు ఐరాస భద్రతామండలి సభ్య దేశాల సహాయం కోరి వుంటే బాగుండేదని చైనా వ్యాఖ్యాతలు దీనిపై చేసిన వ్యాఖ్యల్లో వాస్తవముంది
అణుఒప్పదం పర్యవసానాలు
అణువిద్యుత్‌ వల్ల గొప్పప్రయోజనాలు కలుగుతాయంటూ అణుఒప్పందం చేసుకోవడాన్ని వామపక్షాలు అప్పట్లోనే గట్టిగా వ్యతిరేకించాయి.దానివల్ల కలిగిన ప్రయోజనాలు లేకపోగా అణుకర్మాగారాల వల్ల నష్టాలను ప్రపంచం మరింత ఎ క్కువగా తెలుసుకుంటున్నది. పైగా ఆ ఒప్పందం అమలుకోసం మనం స్వతంత్రంగా అంతకు ముందే నిర్మించుకున్న అణుశక్తి సంస్థలను అమెరికా కూటమి తనిఖీకి అప్పగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా అందులో బాంగా అంతర్జాతీయ అణుసంస్థ భారత్‌కు ఎన్‌ఎస్‌జి నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఎన్‌పిటిపై సంతకం
ఎన్‌ఎస్‌జి నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఎన్‌పిటిపై సంతకం చేయకపోయినా అణుపరికరాలు ముడిపదార్థాల వాణిజ్యం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆచరణలో ఇది అమెరికా కార్పొరేట్ల ప్రయోజనాలకే బాటవేసింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం వల్ల మనకు అదనంగా కలిగే సదుపాయం ఏమీ లేదని డా.శ్రీనివాసన్‌ వంటి అణుశాస్త్రజ్ఞులే చెబుతున్నారు. పైగా మే నెలలో దరఖాస్తు చేసి జూన్‌కల్లా చేరిపోగలమనుకోవడం అవాస్తవికత అని కూడా వారంటున్నారు. 1998లో అణుపరీక్షలు జరిపినపుడు ఆంక్షలు విధించి వేధించిన అమెరికా ఎప్పటికైనా మన స్వతంత్ర అణుశక్తి పెరుగుదలకు సహకరిస్తుందనుకోవడం భ్రమే. .
ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం రాకపోయినా అంతర్జాతీయ మిసిలీ వ్యవస్థ ఎంసిటిఆర్‌'(మిసిలీ టెక్నాలజీ కంట్రోల్‌ రిజిమ్‌)లో చేరడం ద్వారా ఒక ముందడుగు వేసినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. దీంట్లో చైనా లేదు కనక ఇక్కడ దాని ప్రయోజనాలకు సహకరిస్తానని ఇండియా ప్రతిపాదించింది. అయితే ఎంసిటిఆర్‌పై తమకు ఆసక్తిలేదని ఇప్పటికే తాము ఆ దశలన్నీదాటి బుల్లెట్‌ రైళ్ల వేగం బాగా పెంచేయగలిగామని చైనా వ్యాఖ్యానించింది.ఈ వ్యవహారంలో సాంకేతికాంశాలు ఇంకా చాలా వున్నాయి గాని మౌలికమైంది మాత్రం మన దేశ సార్వభౌమత్వాన్ని అలీన సంప్రదాయాలను కాపాడుకోవడమే.భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం చైనాలో అయిదో వంతు మాత్రమే వున్నా అమెరికా కూటమి అతిగా పొగుడుతూ తమ వలయంలోకి లాక్కుంటుందని కొన్ని చైనా పత్రికలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తేడాల కన్నా ఉమ్మడి ప్రయోజనాలే ముఖ్యపాత్ర వహిస్తాయని కూడా నిర్ధారించాయి. భారత జాతీయ వాదం గురించి చెప్పేవారు(బిజెపి నేతలని అర్థం చేసుకోవచ్చు) అంతర్జాతీయ వాస్తవాలను గుర్తిస్తే భారత దేశానికి మేలు జరుగుతుంది అని కూడా చైనా పత్రిక ఒకటి రాసింది. ప్రధాని మోడీ కూడా టైమ్స్‌ నౌ ఛానల్‌ ఇంటర్వ్యూలో చైనాతో స్నేహం అవసరాన్ని చెప్పారు.భిన్నాభిప్రాయాలుండటంలో పొరబాటులేదన్నారు.అన్ని సమస్యల పట్ల అందరూ ఒకే విధంగా స్పందించరు. వారి వారి పరిస్తితులు నేపథ్యాలను బట్టి వ్యవహరిస్తాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సరైన దిశలోనే వున్నాయి. ఒకవైపున ఇలా మాట్లాడుతూనే ఆచరణలో అమెరికాకు లొంగుబాటు వల్ల భంగపాటు తప్ప మరేమీ వుపయోగం లేదని సియోల్‌లో ఎన్‌ఎస్‌జి సమావేశం మరోసారి నిరూపించింది. తాజాగా అమెరికా రాజకీయ విభాగం అధికారి థామస్‌ శాసన్‌ చైనానే ఎన్‌ఎస్‌జిలో భారత్‌ అవకాశాలు దెబ్బతీసిందని దక్షిణ చైనాసముద్రంలో ఉన్మాదంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించడం చూస్తే కావాలని కయ్యం పెడుతున్నట్టు స్పష్టం అవుతుంది. హిందూమహాసముద్రలో ఇండియా తటస్త శక్తిగా వుండేందుకు తాము సహకరిస్తామని చెప్పడం వినడానికే వినోదంగా వుంది. దీనిపై చైనా తీవ్ర ఖండన కూడా వూహించడగిందే. రెండు పెద్ద పొరుగుదేశాలైన చైనా ఇండియాలు ఇలాటి కుట్రలను వమ్ము చేస్తూ ముందుకు సాగితే ఎన్‌ఎస్‌జి ఉదంతం పక్కనపెట్టి మరింత సుహృద్భావం పెంచుకోవచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *